తిరుపతి జిల్లా కోట(M) విద్యానగర్ లోని ఓ బేకరీలో బూజు పట్టిన తినుబండారాలు అమ్ముతున్నారని ఓ కస్టమర్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బ్రెడ్ ప్యాకెట్ను కొని ఇంటికి తీసుకెళ్లగా బూజు పట్టి పాడైపోయిందన్నారు. రెండు రోజుల క్రితం కూడా ఇదే పరిస్థితి ఎదురైనట్లు తెలిపారు.. షాపు సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాచారం ఇచ్చారన్నారు. ఫుడ్ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.