ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడేపి గ్రామంలో నాగుపాము శనివారం కలకలం రేపింది. ఇండ్ల మధ్యలోకి ఆరడుగుల నాగుపాము రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెంటనే ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ మల్లికార్జున కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మల్లికార్జున సంఘటన ప్రాంతానికి చేరుకొని నాగుపామును పట్టుకున్నారు దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న పామును నల్లమల అడవి ప్రాంతంలో వదిలేస్తామని మల్లికార్జున తెలిపారు.