కడప జిల్లా వేంపల్లి పట్టణ సమీపంలోని గండి పులివెందుల బైపాస్ రోడ్డు నందు 8 మంది జూదరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మొత్తం రూ. 82,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వేంపల్లి సీఐ నరసింహులు, ఎస్సై తిరుపాల్ నాయక్ పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించమని హెచ్చరించారు.