ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జరగనున్న గణేష్ నిమజ్జనం ఉత్సవాల ఏర్పాట్లను గురువారం సాయంత్రం ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ జిల్లా అధికారులతో కలసి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాగు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు తో సిద్ధంగా ఉండాలని మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఉన్నారు.