కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని కడప తాడిపత్రి జాతీయ రహదారి మదీనా కాలేజ్ దగ్గర శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కడప విమానాశ్రయం దగ్గర ఉన్న శాటిలైట్ సిటీ కాలనీ కి చెందిన ఓ దివ్యాంగుడు తన మూడు చక్రాల బండి పై వెళుతున్న సమయంలో తోళ్ల గంగన్న పల్లె కి చెందిన వ్యక్తి పల్సర్ బైక్ ఢీకొట్టడం జరిగిందన్నారు. ఈ సంఘటనలో దివ్యాంగుడికి గాయాలు కాగా 108 వాహనం ద్వారా కడప రిమ్స్ కి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది