వరంగల్ నగరంలో దారుణం చోటుచేసుకుంది హంటర్ రోడ్డులో భార్య గౌతమిని(21) భర్త గణేష్(22) హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది మృతురాలు గౌతమి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా వీరారం గ్రామపంచాయతీ బాల్య తండాగా గుర్తించారు. నాలుగు నెలల క్రితమే గౌతమి గణేష్ల వివాహం జరిగిందని, గణేష్ ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడని వివాహేతర సంబంధం పెట్టుకున్న గణేష్ ఈ సంబంధానికి భార్య అడ్డుపడుతున్న కారణంతో భార్యను హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు బాల్య తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి