సోలార్ ప్లాంట్ ను పరిశీలనకు వచ్చిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అసభ్యంగా మాట్లాడడం దారుణమైన విషయమని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం అన్నారు. గుత్తిలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్పీ,సీపీఐ,సీపీఎం,ఎస్ఎఫ్ఐ, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలూరులో తరిమి కొడితే ఇక్కడికి వచ్చావన్నారు. గుంతకల్లు నియోజకవర్గం నుంచి కూడా నిన్ను తరిమి కొడతారన్నారు. డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే సీటు తెచ్చుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరకునే ప్రసక్తే లేదన్నారు.