సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేట పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తురెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యారంగ సమస్యల పైన పోరాటాలు నిర్వహించాలన్నారు. భగత్ సింగ్ సేవలు దేశానికి చిరస్మరణీయం అన్నారు.