నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కోతుల్గాం గ్రామ శివారులోని గుట్టపై బండరాయి కింద గణనాథుడి ఆకృతిలో ప్రతిమ కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆదివారం శోభాయాత్రగా డప్పువాయిద్యాల మధ్య గుట్టపైకి వెళ్లి వినాయకుడిని ఊళ్లోకి తీసుకవచ్చారు. వినాయకుడి ప్రతిష్ఠించే స్థలం వద్ద గ్రామస్తులు పూజలు చేశారు. గ్రామస్తులు వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.