ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్య సాహసాలకు మారుపేరు అని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు.నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఉదయం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాస రెడ్డి, సీఐ సిబ్బంది పాల్గొన్నారు.