ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల మరియు కొత్తపట్నం పరిసర ప్రాంతాలలో సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. బుధవారం సాయంత్రం సమయంలో సముద్రం మరింత ఉధృతంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా అధికారులు చేపల వేటను నిషేధించారు. ప్రజలెవరు సముద్ర ప్రాంతానికి ఈతకు లేదా సందర్శించేందుకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.