నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని 5వ వార్డులో గురువారం ఉదయం ఎమ్మెల్యే బాలు నాయక్ జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీలో ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించడమే లక్ష్యమన్నారు.