బంజారా, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని ఆదివాసీ నాయకులు సోయం బాపూరావు, తెల్లం వెంకటరావు సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం పై రాష్ట్రస్థాయిలో గిరిజన సంఘాల నాయకులు,మేధావులు, న్యాయ నిపుణులతో ఆదివారం హైదరాబాదులో జరుగుతున్న చర్చ గోష్ఠి లో పాల్గొనడానికి కరీంనగర్ నుండి బయలుదేరిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు బోడా మోహన్ నాయక్, రాష్ట్ర నాయకులు శివరాజులను ఆదివారం ఉదయం 11గంటలకు హౌస్ అరెస్ట్ చేసిన కరీంనగర్ టూటౌన్ పోలీసులు. ఈ సందర్భంగా బీమా సాహెబ్ మాట్లాడుతూ బంజారాలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలనడం చట్ట విరుద్ధమని అన్నారు.