వెంకటాపురం లో యూరియా పంట పొలాలలో మోతాదుకు మించి వాడరాదని వ్యవసాయ అధికారిని హెప్సిబారాణి, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సుధారాణి తెలిపారు. మంగళవారం వెంకటాపురం ప్రధాన సెంటర్లో రైతులకు యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో యూరియా కొరత లేదని, విస్తీర్ణం కంటే ఎక్కువ యూరియా పంపిణీ చేసినట్లు తెలిపారు. యూరియాకు బదులుగా నానో యూరియాను పంటలో రైతులు పిచికారి చేయాలని చెప్పారు.