నగర ప్రజలు నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి నగరాభివ్రుద్దికి సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. మంగళవారం సాయంత్రం నగరంలోని వెంకటరామా పౌల్ట్రీస్ మరియు వైష్ణవి కాంప్లెక్స్ వారు వారి 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి ఆస్తి పన్నుకు సంబంధించి చెక్కులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులును ఆయన ఛాంబర్ నందు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వారిని అభినందించి మాట్లాడారు.