ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి అభ్యసనా సామర్ధ్యాలకు పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయం లో గల పాత గ్రీవెన్స్ హాలు నందు వన్ స్కూల్ అట్ ఎ టైమ్ (OSAAT) వారితో ఎంఓయూ జిల్లా విద్యాశాఖ తరఫున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సంస్థ సి ఈ ఓ వాదిరాజ్ భట్, స్ట్రాటజీ అడ్వైజర్ కేదార్ శాస్త్రి (రిటైర్డ్ ఐ ఏ ఎస్) మరియు తదితరులతో జరిగింది.