దసరా కానుకగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా 15 వేల రూపాయలను అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం నగర శివారులోని శ్రీనగర్ కాలనీలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా ఆయన దసరా కానుకగా వాహన మిత్రులు అందిస్తామని తెలియజేశారు.