వేపాడ మండలం బొద్దాం జంక్షన్ లో ఆటో కార్మికులు గురువారం మధ్యాహ్నం ఆందోళన, భిక్షటన కార్యక్రమాలు నిర్వహించారు. స్వయం ఉపాధితో ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న తమకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన జరిపారు. అలాగే ప్రజలు, ప్రయాణికుల నుంచి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పూర్వ జిల్లా కార్యదర్శి చల్లా జగన్ మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత ఆటో కార్మికులు రోజురోజుకీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆటో కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు సిఐటియు రైతు సంఘం నాయకులు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు