పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండల గ్రామంలో రెండు రోజుల క్రితం పొలంవిషయంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన దాడి కేసులోనిందితుడు లక్ష్మినరసింహను అరెస్టు చేసినట్లు ఎస్సైకృష్ణమూర్తి గురువారం తెలిపారు. మౌలాలి కుటుంబ సభ్యులఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని స్థానికకోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించారు.కేసు విచారణ కొనసాగుతోందని ఎస్సై కృష్ణమూర్తి పేర్కొన్నారు.