రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మున్సిపల్ మండల పరిధిలోని ప్రవాస్ యోజన పల్లె పల్లెకు బిజెపి కార్యక్రమాల్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు గజమాలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావుకు ఘన స్వాగతం పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడం జరుగుతుందని అన్నారు .కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్తపై నాయకులు ఉందని అన్నారు.