వైసీపీ ఇవాళ తలపెట్టిన అన్నదాత పోరుకు పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి నోటీసులు అందించారు. 30 యాక్ట్ అమలులో ఉందని, నిరసన ర్యాలీలు చేపట్టకూడదని, కేవలం 10 మందితో వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతకు మద్దతుగా నిలుస్తుంటే అడ్డుకోవాలని చూడటం సరైంది కాదన్నారు.