గ్రూప్-1 పరీక్ష నిర్వహణంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున..నైతిక బాధ్యత వహిస్తూ TGPSC చైర్మన్ మరియు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం 2గంటలకు శాంతియుత నిరసనలో భాగంగా శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేటు దగ్గర నిరుద్యోగ విద్యార్థులతో BRSV నాయకులు కలిసి పోలీస్ ల నిర్బంధం మధ్య ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్బంగా కరీంనగర్ గ్రంధాలయం సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడిగే వారిని అరెస్టులు చేయడం కాదు గ్రూప్ -1పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.