భీమవరం బైపాస్ రోడ్‌లోని రైల్వే గేట్ సమీపంలోని పంట కాలవ వద్ద శనివారం ఉదయం 11.30 గంటలకు ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు తోట సత్యనారాయణ (45)గా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అన్వేషిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.