ఎల్.ఎన్.పేట మండలాన్ని టెక్కలి రెవెన్యూ డివిజన్ నుంచి శ్రీకాకుళం డివిజన్లోకి మార్చే వరకు పోరాటంతో సాధించుకుందాం అని పోరాట కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఎల్.ఎన్.పేట మండలం మోదుగువలస శివాలయం వద్ద ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రజల అభిప్రాయాన్ని అధికారులకు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, కమిటీ సభ్యులకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పది రోజులు కార్యాచరణతో ముందుకు వెళదామన్నారు.