దివ్యాంగ చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం జిల్లా వికలాంగ శాఖ కోఆర్డినేటర్ గోవిందరావు తెలిపారు. శుక్రవారం నరసన్నపేట ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు కావలసిన వివిధ రకాల పరికరాలను మార్చి నెలలో అందజేస్తామన్నారు. సుమారు వంద మందికి పైగా నాలుగు మండలాల నుంచి వచ్చినట్లు తెలిపారు.