మేడారం జాతర జరిగే సమయంలో పంటలు వేయకుండా బీడుగా ఉండే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మేడారం జాతర పంట నష్టపరిహార కమిటీ అధ్యక్షుడు ఆలం కృష్ణ నేడు శనివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు అన్నారు. జాతరకు రూ.150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, జాతర సమయంలో సమీప గ్రామాలైన ఊరటం, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం, నార్లాపూర్, వెంగలాపూర్ గ్రామాల్లో వందల ఎకరాల భూములు రైతులు వదులుకోవాల్సి వస్తుందన్నారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం చెల్లించాలన్నారు. నష్టపరిహారం డబ్బులు అందించేలా చూడాలని అమ్మవారి గద్దెల వద్ద వినతి పత్రం అందజేశారు.