శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయం నుండి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి టీఎస్ సి ఎం ఎం ఎస్ ను వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 ద్వారా న్యాయం పొందటానికి ఆర్డిఓ కార్యాలయంలో ట్రిబ్యునల్ కేసులు పెట్టి న్యాయం పొందవచ్చని లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ వద్ద అపీలు చేసుకోవచ్చని అన్నారు వై వృద్ధులు తమ కేసులకు సంబంధించిన వివరాలను పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని కావున పోర్టల్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.