రాష్టంలో యూరియా కొరతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికార పార్టీ నాయకులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నంద్యాల లోని ఎన్జిఓ కాలనీ టి.నరసింహయ్య భవన్ లో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు రమేష్ కుమార్,రాజశేఖర్ లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఎక్కడైతే రైతులకు యూరియా అవసరం ఉందొ అక్కడ రైతు సేవా కేంద్రాల ద్వారా గానీ, సొసైటీల ద్వారా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.