ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో సివిల్, ట్రాఫిక్ చాలన్ లు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ డిస్క్యూట్స్ ఇతర కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.