నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దాదాపు 200 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కమిషనర్ నందన్ తెలిపారు. రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద సిసి రోడ్లు నిర్మాణం తో పాటు.. డివైడర్లు మధ్యలో చెట్ల పెంపకం చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లో జరగనంత అభివృద్ధి పనులు ఒక్క నెల్లూరులోనే జరుగుతున్నాయని.. అందుకు మంత్రి నారాయణ తో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారం మరువలేనిదని మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు