రాష్ట్ర ప్రభుత్వ నూతన బార్ పాలసీ – 2025-28లో భాగంగా గీత కులాలకు రిజర్వ్ చేసిన 10 శాతం కోటాలో కర్నూలు జిల్లాకు మూడు బార్లు కేటాయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఎం.సుధీర్ బాబు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక బార్ గౌడ్ కులానికి, మరొకటి ఈడిగ కులానికి రిజర్వ్ చేయగా, ఆదోని మున్సిపాలిటీలోని బార్ ను ఈడిగ కులానికి కేటాయించారు. దరఖాస్తుదారులు తహసిల్దార్ జారీ చేసిన సప్లిమెంటరీ కుల ధృవపత్రాన్ని తప్పనిసరిగా జతచేయాలి.దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు (తిరిగి చెల్లించబడదు), ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలుగా నిర్ణయించారు