ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి భవాని చంద్ర న్యాయవాదులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పోలీస్ కేసులు, భార్యాభర్తల వివాదాలు, ఎక్సైజ్, బ్యాంక్ కేసుల వంటి రాజీ చేయదగ్గ కేసులలో ఇరువర్గాలు లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకోవచ్చని తెలిపారు. క్షణికావేశంలో తగాదాలు పడి కేసులు నమోదు చేసుకుని, కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా, సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలని ఆమె సూచించారు.