గుత్తి మండల శివారులోని కొత్తూరు కు చెందిన రైతు నాగార్జునసాగర్ ను పాము కాటు వేసింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ తన వాము దొడ్డి లో ఉన్న సంచిని తీసుకుంటున్న సమయంలో పాము కాటు వేసింది. వెంటనే స్థానికులు గమనించి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి నాగార్జునసాగర్ కు వైద్యం అందించారు.