ఏలూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలను సోమవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో అవసరమైన భవనాలు వైద్య చికిత్స పరికరాలు ఏమి అవసరమో వైద్య శాఖ అధికారాలనుండి మంత్రి కొలుసు పార్థసారథి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సిబ్బంది నియామకాలు భర్తీ చేయటంతో పాటు ప్రభుత్వం ద్వారా లేదా సిఎస్ఆర్ ద్వారా అవసరమైన అన్నిమౌలిక సౌకర్యాలను సమకూర్చేలా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కొన్ని భవనాలను వైద్య కళాశాలకు వినియోగించుకోవడం జరుగుతున్నదని అన్నారు.