ములుగు జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన గర్భిణి కుంజ సోనీ ప్రసవం కోసం వెంకటాపురం ఆసుపత్రిలో చేరారు. అక్కడి సిబ్బంది ములుగు ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయగా ఏటూరునాగారం అంబులెన్స్లో గర్భిణిని నిన్న బుధవారం రోజున రాత్రి ములుగు ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో మండపాక సమీపంలోని పూసూరు బ్రిడ్జిపై పురిటి నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ కుమార్, పైలెట్ కోటి అంబులెన్స్లోనే ప్రసవం చేశారు.