కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ శివారులోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో శుక్రవారం ఉదయం దొంగలు దూరారు. ఓ మహిళ మెడలో చైన్ తస్కరించేందుకు చేసిన ప్రయత్నం వికటించి దొరికిపోయారు. అయితే మహిళల బాత్రూంలు టార్గెట్ చేసుకుని దొంగతనానికి యత్నించడం కలకలం రేపుతుంది. మహిళల బాత్రూంలోకి ఓ మహిళతో పాటు మరో పురుషుడు బుర్కాను ధరించి బాత్రూంలో చొరబడటం అది మహిళ బాత్రూంలు కావడం వివాదస్పదంగా మారింది. మహిళలు వాష్ రూం వెళ్లేందుకు లోపలికి రాగానే వారిని అటకాయించి దోచుకుని ఆపై వాష్ రూం గడియపెట్టి పారి పోయేందుకు యత్నించారు. బాదిత మహిళ అరవడంతో స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.