శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతి చదివే 135 మంది విద్యార్థులకు శనివారం మధ్యాహ్నం మంత్రి కవిత ఆదేశాలతో పెనుకొండ మండల టీడీపీ నాయకులు డైరీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ, సమాజ సేవ కోసం మంత్రి సవిత తన తండ్రి పేరు మీద ట్రస్ట్ స్థాపించి ప్రజలకు, విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు.