జనగామ జిల్లా దేవరుప్పుల కడవెండి గ్రామంలోని వానకొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని పాలకుర్తి MLA యశస్విని రెడ్డి మంగళవారం సందర్శించారు.ఆలయ దర్శనం అనంతరం మండల అధికారులు,ఎండోమెంట్స్ శాఖ అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇటీవల మంజూరైన 1కోటి నిధులతో ఆలయ ప్రాంగణం మొత్తం పునరుద్ధరణ చేయడమే కాకుండా కళ్యాణమండపం,స్నానపు గదులు, అన్నదాన సత్రం, భక్తుల కోసం తాగునీటి సదుపాయాలు, పార్కింగ్ స్థలాలు వంటి వసతులను కల్పించాలని నిర్ణయించారు..