సత్తెనపల్లి వడ్లవల్లి వీధి శాస్త్రి నగర్లో విషాద ఘటన అలెస్యంగా వెలుగులోకి వచ్చింది.శనివారం 11 ఏళ్ల బాలుడు బెంజిన్ తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు. తల్లి స్కూలుకి వెళ్లలేదని మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.