దేవనకొండ బస్టాండ్ వద్ద కొనసాగుతున్న ధర్నా ఉద్రిక్తంగా మారింది. చిన్నారి హత్య కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుమీద కూర్చొన్నారు. 3 గంటల పాటు వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడగా, వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు నిరసనకారులతో చర్చించారు. అయినా ఆందోళన కొనసాగించడంతో వారిని చెదరగొట్టారు