తిరుపతిలో మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా అలిపిరి పాదాల మండపం వద్ద ఎమ్మెల్యే ఆర్యని శ్రీనివాసులు టెంకాయలు కొట్టారు పేద ప్రజలకు అట్టడుగు వర్గాల వారికి అండగా నిలిచే నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్యే కొనియాడారు. పవన్ కళ్యాణ్ సేవలు రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరం అన్నారు.