శనివారం మాజీ కార్పొరేటర్ 5వవార్డ్ వైస్సార్సీపీ అధ్యక్షులు పోతిన హనుమంతురావు భవనం కొంత భాగం రహదారి నిమిత్తం జీవీఎంసీ అధికారులు తొలగించారు. సమాచారం తెలుసుకున్న విజయనగరం జడ్పీ చైర్మన్, విజయనగరం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం అధ్యక్షులు చిన్ని శ్రీను ఆదివారం పరిశీలించారు. వైస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తూ కక్షపూరీత రాజకీయం చేస్తున్నారని అన్నారు. టీడీఆర్ లు అందచేయకుండా దౌర్జన్యంగా కూల్చటం సరి కాదని అన్నారు.