ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని ఈడుపూరు మరియు బోడపాడు గ్రామాలలో కొలంబిలిస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి బుజ్జి బాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ పంట వేసినా ప్రతి రైతు ఈ పంట నమోదు చేయించుకోవాలన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులు గ్రామ రెవెన్యూ అధికారులను కలిసి ఈ పంట నమోదు ప్రక్రియ చేయించుకోవాలని సూచించారు. ఈ పంట నమోదు చేసుకోవడం వలన ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేటటువంటి పంట నష్టపరిహారం మరియు పంటల బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకం ఆగస్టు 30వ తారీకు తో ముగుస్తుందని తెలిపారు.