అచ్చంపేట మండలంలోని బోల్గట్ పల్లి లో పొలంలో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోల్గుట్ పల్లికి చెందిన స్వాములు (50) వ్యవసాయ పొలానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖకు గురై మృతి చెందాడు. విషయం పోలీసులకు తెలియడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.