జూలూరుపాడు గ్రామంలో కరివారిగూడెం గూడెం గ్రామంలో పడకేసిన పారిశుధ్యం, సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు కొండపల్లి శ్రీధర్ జూలూరుపాడు మండల కార్యదర్శి యాసా నరేష్ కరివారిగూడెం గ్రామశాఖ సభ్యులతో కలిసి గ్రామంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సిపిఎం పార్టీ బృందం ముందు అనేక సమస్యల్ని గుర్తించటం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు మాట్లాడుతూ గ్రామంలో నెలలు తరబడి వర్షాలు కురుస్తున్న బ్లీచింగ్ శానిటేషన్ పనులు జరగటంలేదని అలాగే వీధిలైట్లు ఏర్పాటు చేయక నెలలు గడుస్తుందని ఆయన అన్నారు.