పదే పదే హారన్ కొడుతూ.. విసిగిస్తున్నాడని RTC డ్రైవర్ తో ఓ ఆటో డ్రైవర్ వాగ్వివాదానికి దిగాడు. ఈ ఘటన పొదలకూరు మండలం మరుపూర్ సమీపంలో జరిగింది. ముందు వెళ్తున్న ఆటోను తప్పించేందుకు నెల్లూరు నుంచి రాజంపేట వెళ్తున్న RTC బస్సు డ్రైవర్ పదే పదే హారన్ కొడుతున్నాడని ఆటో డ్రైవర్ బస్సు ను ఆపేసి.. డ్రైవర్ తో గొడవకు దిగాడు. కానిస్టేబుల్ వారిస్తున్నా.. వినలేదు.. దింతో రోడ్డు మీద వాహనాలు నిలిచిపోయాయి.