కొందుర్గు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయబోయే పోలింగ్ కేంద్రాన్ని శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఏసిపి రంగస్వామి, రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్, స్థానిక ఎస్సై జై కృష్ణలు ఉన్నారు. అనంతరం మండలంలో శాంతిభద్రతల విషయమై అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను పురస్కరించుకొని నిఘా పకడ్బందీగా ఆయన అధికారులకు సూచించారు.