జనసేన కార్యకర్తలకు అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి.గన్నవరం మండలం, జి.పెదపూడి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త ఈరి సాయికృష్ణ ప్రమాదవశాత్తు మృతి చెందగా, పార్టీ నుంచి మంజూరైన రూ.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే గిడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. సభ్యత్వం నమోదు చేయించిన వాలంటీర్ కు అభినందనలు తెలియజేశారు.