బుధవారం రోజున పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చత్రపతి యువసేన ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన భారీ మట్టి గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే నిమజ్జనానికి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు పెద్ద వినాయకుడిని ఏర్పాటు చేయడం పట్ల చత్రపతి యువసేన నిర్వాహకులను అభినందించారు