రామాయంపేటలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పలు కాలనీలను మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు తో కలిసి మంత్రి దామోదర రాజానరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా ఇల్లు కూలిపోయిన పాక్ష్యంగా దెబ్బతిన్న ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తుందని, అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేస్తుందని, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన పంట పొలాల రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు అధైర్య పడవద్దని తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి పోలీసు అధికారులు చాలా బాగా పని చేశారని వారికి ధన్యవాదాలు అన్నారు.